బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్ ఈ సినిమాలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా భారీ రేంజ్ లో తెరకెక్కుతుంది. సినిమా నుండి వచ్చిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంటున్నారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ్.

బాహుబలి సినిమా వీకెండ్ వరకు 500 కోట్ల దాకా వసూళ్లు రాబట్టిందని.. బాహుబలి 2లో కూడా అదే రేంజ్ లో కలక్షన్స్ రాబట్టిందని.. ట్రిపుల్ ఆర్ కూడా దాదాపు 500 కోట్లు వసూలు చేసి రికార్డ్ స్థాయిలో నిలుస్తుందని అన్నారు తమ్మారెడ్డి. బాహుబలి 2 వీకెండ్ 400 కోట్లు మించి వసూళ్లు చేసిందని.. ఆ రికార్డ్ ను ఆర్.ఆర్.ఆర్ రికార్డ్ బ్రేక్ చేస్తుందని అన్నారు తమ్మా రెడ్డి.

ఆర్.ఆర్.ఆర్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. రాజమౌళి సినిమా అంటే రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ సినిమా గురించి తమ్మా రెడ్డి ప్రిడిక్షన్ నిజమవుతుందో లేదో చూడాలి. తప్పకుండా అదే జరిగితే మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. 2021 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. సినిమాను 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఈసారి కూడా 2000 కోట్ల వసూళ్ల టార్గెట్ పెట్టుకున్నారని తెలుస్తుంది.                                                              



మరింత సమాచారం తెలుసుకోండి: