సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అది ఎలాంటి సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు మెచ్చేస్తున్నారు. మనసుకి నచ్చే కథ అది ఎలాంటిదైనా సరే తెలుగు ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ కొత్త ప్రయత్నాన్ని కూడా ప్రమోట్ చేస్తూ తెలుగు ఆడియెన్స్ ఎప్పటికి స్పెషల్ అనేలా చేస్తున్నారు. ఇక అలాంటి కోవలోనే వస్తున్న మరో కొత్త సినిమా నాట్యం. రేవంత్ కోరుకొండ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. కథను వింటాం.. అదే కథను మన కళ్లకు చూపిస్తే అదే నాట్యం అంటూ టీజర్ స్టార్టింగ్ లోనే సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాడు కథను నాట్యం రూపంలో చెప్పడమే నాట్యం కథ అంటూ టీజర్ తో అద్భుతంగా మెప్పించేశాడు. ఇక ఈ టీజర్ చూసి సినిమాపై అంచనాలు పెంచేశారు. సినిమా బాగా రావడంతో దిల్ రాజుకి చూపించి ఆయన డిస్ట్రిబ్యూషన్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్, ఎడిటింగ్, కెమెరా అన్నిటిని రేవంత్ చాలా చక్కగా చేసినట్టు ఉన్నారు.

సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ కూచిపుడి డ్యాన్సర్ సంధ్యా రాజు నటించారు. ఆమె తెలుగు తెరకు తొలిపరిచయంగా ఈ సినిమా రాబోతుంది. ఈ నాట్యం సినిమా టీజర్ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేసింది. సినిమాకు శ్రావణ్ భరధ్వాజ్ మ్యూజిక్ కూడా చాలా ప్రాముఖ్యత వహించిందని తెలుస్తుంది. టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మరి నాట్యం నిజంగా టీజర్ రేంజ్ లో సినిమా కూడా ఉంటే ఈ కొత్త ప్రయత్నం సక్సెస్ అయినట్టే లెక్క.      \
         

మరింత సమాచారం తెలుసుకోండి: