అంతలా ఈయన టేకింగ్ ఉంటుంది. అలాంటి చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన తాజా చిత్రం 'చెక్'.నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది.భవ్య క్రియేషన్స్' వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్లు అమితంగా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి కాబట్టి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. నిజానికి నితిన్ తో గతంలోనే ఓ చిత్రం చెయ్యాలని దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి అనుకున్నాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆయన చెప్పుకొచ్చాడు.
చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ..చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకున్నాడనేది 'చెక్' సినిమా ఇతివృత్తం.ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకుని దాని మీద పని చేశా. సెకెండాఫ్ వర్కవుట్ కాక వదిలేశాం. ఈ సినిమాతో మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్ కుదిరింది. నితిన్‌ను తప్ప మరో హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేదు. తను లేకపోతే ఈ చిత్రం లేదు. కల్యాణి మాలిక్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అవుతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు ఈ సినిమా దర్శకుడు...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి