న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన గత సినిమా 'వి' సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా  కావడంతో ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు నటిస్తున్నా  రు.

సినిమా కథ గురించి ఒక అప్ డేట్ తెలిసింది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్, మెయిన్ గా బ్రదర్ సెంటిమెంట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌ లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాని కి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సినిమా తర్వాత నాని శ్యామ్ సింగ్ రాయ్ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు..విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్సినిమా కి దర్శకుడు. ఈ సినిమా తో పాటే బ్రోచేవారెవరురా అంటూ విభిన్నమైన కాన్సెప్ట్ తో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  నాని అంటే సుందరానికి అనే  సినిమా చేయబోతున్నా డు.. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: