స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న సినిమా పుష్ప‌. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో నటిస్తున్నారు. దాంతో సినిమాలో బ‌న్నీ లుక్ ఇదివ‌ర‌కు సినిమాల‌తో పోల్చితే డిఫెరెంట్‌గా క‌నిపిస్తోంది. సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న నటిస్తోంది. ఈ చిత్రాన్ని గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. దాంతో సినిమాలో ఎక్కువ భాగాన్ని ఏపీలోని రంప‌చోడ‌వ‌రంతో పాటు హైద‌రాబాద్ లో ఓ ప్ర‌త్యేక సెట్ లో చిత్రీక‌రించారు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం పుష్ప టీం త‌మిళ‌నాడు వెళ్లింది అక్క‌డ పుష్ప‌రాజ్ కుటుంబ స‌భ్యుల పై కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో అనసూయ న‌టిస్తోందంటూ కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా అన‌సూయ స్పందించింది.

ఇప్ప‌టివ‌ర‌కూ త‌న‌కు పుష్ప టీం నుండి ఎలాంటి ఆఫ‌ర్లు రాలేద‌ని..ఒక వేళ ఆఫ‌ర్ వ‌స్తే ఖ‌చ్చితంగా ఓకే చెబుతాన‌ని స్ప‌ష్టం చేసింది. అయితే త‌నకు ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా బుల్లి తెర‌ను మాత్రం వ‌దిలేది లేద‌ని అనసూయ స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా త‌న‌కు ఇతర ఇండ‌స్ట్రీ ల‌నుండి కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ని చెప్పింది. బాలీవుడ్ దర్శ‌క నిర్మాత‌లు సైతం త‌న‌ను సంప్ర‌దించార‌ని వెల్ల‌డించింది. నిజానికి అన‌సూయ ప్ర‌స్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది అయిన‌ప్ప‌టికీ బుల్లితెర‌పై మాత్రం ర‌చ్చ చేస్తునే ఉంది. మ‌రోవైపు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ మ‌రికొన్ని సిన‌మాల్లో న‌టిస్తోంది. ఇక ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఖిలాడీ సినిమాలో అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండగా... కార్తికేయ హీరోగా న‌టిస్తున్న చావు క‌బురు చ‌ల్ల‌గా సినిమాలో ఐటం సాంగ్‌తో అల‌రిస్తోంది. అంతే కాకుండా అన‌సూయ లీడ్ రోల్ గా కూడా కొన్ని సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: