టాలీవుడ్ లో ఒక చిన్న సినిమా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి,కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది..అంతేకాదు జాతీయ పురస్కారాన్ని కూడా దక్కించుకుంది..ఆ సినిమా మరేదో కాదు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'పెళ్లి చూపులు'.. విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీలో యంగ్ హీరోయిన్ రీతు వర్మ నటించింది. అయితే ఈ మూవీకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ప్రస్తుతం తమిళంలో మంచి విజయం సాధించిన "ఓ మై కడవలే" అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

అలాగే ఆ మధ్య టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన "మిడిల్ క్లాస్ మెలోడీస్" చిత్రం లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో మెరిశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో తరుణ్ భాస్కర్ ఆసక్తికర విషయాలు చెబుతూ పలు అంశాలు షేర్ చేసుకున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కోసం చాలా కష్టాలు పడినప్పటికీ ఫలితం వచ్చాక కష్టాలన్నింటిని మరిచిపోయేలా చేసిందన్నాడు. ముఖ్యంగా తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టు కున్నందుకు తనకు ఎంతో సంతోషం కల్గిందన్నాడు.

కథ స్క్రిప్టు పనుల సమయంలో తనకి మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఎంతగానో సహాయం చేసిందని తెలిపాడు.అయితే ఈ చిత్రం తెరకెక్కించడానికి అనువైన నిర్మాత కోసం వేటాడుతున్న సమయంలోనే తన తండ్రి మరణించాడని దాంతో ఎలాగైనా తన తండ్రి సంవత్సరికం జరిగే లోపు సినిమా తీసి విడుదల చేస్తానని తన తల్లికి మాటిచ్చానని తరుణ్ భాస్కర్ చెప్పాడు. అందుకే పలువురి నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగే వాడినని తెలిపాడు. నిర్మాత రాజ్ కందుకూరి డబ్బులు పెట్టేందుకు ముందుకు రావడంతో ఆలస్యం చేయకుండా సినిమా పనులు మొదలు పెట్టామని తెలిపాడు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటూ మరో ఐదారుగురు టాలీవుడ్ హీరోలు ఈ కథ విన్నప్పటికీ.. చివరికి విజయ్ దేవరకొండని హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: