హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదే సమయంలో సినిమా ప్రమోషన్స్‏లో డిఫరెంట్ వీడియోలతో.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు చిత్రయూనిట్. ఇక రంగ్ దే టీంకు సంబంధించిన చిలిపి అల్లరి వీడియోలో సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి.

అయితే గతంలో కీర్తి.. షూటింగ్ గ్యాప్‏లో చిన్న కునుకు తీస్తుండగా.. దానిని ఫోటో తీసి నెట్టింట్లో షేర్ చేశారు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నితిన్. దీంతో వారిద్దరి పని తర్వాత చేప్తాను అంటూ కీర్తి ప్రతిజ్ఞ చేసింది. చెప్పినట్లుగానే.. డైరెక్టర్ వెంకీని పరిగెత్తించి మరీ కొట్టింది కీర్తి. అది కూడా సీరియస్‏గా కాదండోయ్.. సరదాగానే అలా చేసింది. ఆ తర్వాత నితిన్‏కు సంబంధించిన ఓ ఫోటోను కాస్తా ఎడిట్ చేసి షేర్ చేసింది.



ఇక ఇటీవల సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా… రాజమండ్రిలో నిర్వహించిన రంగ్ దే ఈవెంట్‏కు హాజరయ్యారు చిత్రయూనిట్. అక్కడ వారి కోసం రకారకాల ఫుడ్ ఐటమ్స్‏ను డిన్నర్‏గా అందించింది అక్కడి సిబ్బంది. అయితే వీరు వీడియో చేస్తున్న సమయంలో కీర్తి మాత్రమే కూర్చోని ఫుల్‏గా ఆరంగించేసింది. అది చూసిన నితిన్, దేవి శ్రీ ప్రసాద్ నోరెళ్లబెట్టారు. కీర్తిని చూసి అహా నా పెళ్ళంట సినిమాలోని వివాహ భోజనంబు అనే పాట పాడారు.

అనంతరం బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే అంటూ తమ బాధలు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ఇదిలా ఉంటే కీర్తి ఈ సినిమాలోనే కాకుండా… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. బ్యాంకింగ్ రంగం లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: