ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న ఢీ షో లో అద్భుతమైన నాట్య ప్రదర్శన కనపరిచి మంచి పేరు తెచ్చుకున్న డ్యాన్సర్లు ఎందరో ఉన్నారు. కొందరు చిన్నపాటి సెలబ్రిటీ స్థాయిలో సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకోగలరు. వారిలో ఢీ మాజీ కంటెస్టెంట్ అక్సా ఖాన్ కూడా ఒకరుగా నిలుస్తున్నారు. ఢీ 10 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో డాన్స్ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులతో పాటు జడ్జీలను సైతం మంత్రముగ్ధులను చేశారు. అయితే ఆమె మంచి డాన్సర్ అయినప్పటికీ ఫైనల్స్ కి చేరుకోలేకపోయారు. కానీ శేఖర్ మాస్టర్ ఆమె చేత స్పెషల్ పర్ఫామెన్స్ చేయించారు. ఢీ 10 ఫైనల్ కి ముఖ్యఅతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.


అయితే తారక్ తో కలసి స్వింగ్ జరా స్వింగ్ జర అనే పాటకు అక్సా ఖాన్ డాన్స్ చేశారు. దీంతో అప్పట్లో ఈమె గురించి అనేక వార్తలు వెల్లువెత్తాయి. ఫైనల్ విజేతలకు రాని పేరు ఈమెకు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన అక్సా ఖాన్ ఇప్పటికీ లైమ్ లైట్ లో ఉంటున్నారు. డాన్సర్ గా పరిచయమైన ఆమె త్వరలోనే ఆర్జీవీ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై తళుక్కుమని మెరవనున్నారు. కెరీర్ పరంగా ఆమె జీవితం సాఫీగానే కొనసాగుతుంది కానీ వ్యక్తిగత జీవితం మాత్రం అస్సలు బాగోలేదు అని తెలుస్తోంది.


వివరంగా తెలుసుకుంటే అక్సా ఖాన్.. ఢీ షో లో మరో డాన్సర్ అయిన పండు అనే వ్యక్తి తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఢీ ఛాంపియన్స్ నుంచి పండు ఎలిమినేట్ అయినప్పుడు ఆమె శేఖర్ మాస్టర్ తో గొడవ కూడా పెట్టుకున్నారు. అప్పటి నుంచి పండు, అక్సా మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని ప్రేక్షకులు బలంగా నమ్మారు. ఢీ జోడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి అనేక ప్రోగ్రాములలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు కలిసి ఒక డాన్సింగ్ అకాడమీ పెట్టి లైఫ్ లో సెటిలై పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయని.. పండు అక్సా ఖాన్ ని వదిలేశారని తెలుస్తోంది. ఆమె ప్రవర్తన అసలు పండు కి నచ్చడం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే పెళ్లి చేసుకోవాలనుకున్న తన కలలు కల్లోలం కావడంతో అక్సా ఖాన్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా చూడముచ్చటగా ఉన్న ఈ జంట విడిపోవడం అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: