రాజా రాణి,
అదిరింది సినిమాలకు దర్శకత్వం వహించిన
కోలీవుడ్ స్టార్
డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. అయితే ఆయన దర్శకత్వంలో భవిష్యత్తులో తెరకెక్కనున్న ఒక సినిమాలో జూ.ఎన్టీఆర్,
దళపతి విజయ్ కలిసి నటించబోతున్నారని ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త
తమిళ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు, ఓ స్టార్
డైరెక్టర్ కలిసి ఓ మల్టీస్టారర్
మూవీ చేస్తే అది ఏ స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో ఊహించడం కూడా కష్టమే. అయితే వీరి కాంబినేషన్ లో నిజంగానే ఒక
సినిమా రాబోతోందని
తమిళ మీడియా వార్తలు ప్రచురిస్తుండటంతో ప్రస్తుతం
ఎన్టీఆర్అభిమానులు బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ వార్తల్లో నిజముందా అని అడిగితే మిశ్రమ సమాధానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ తమ తమ సినిమాలతో బిజీగా సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి ఓ
సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారా.. ఒకవేళ
మూవీ చేసేందుకు రెడీ అయిన ఇప్పటికిప్పుడు
సినిమా సెట్స్ పైకి వెళ్లడం సాధ్యమవుతుందా.. అని ప్రశ్నిస్తే సమాధానాలు నెగిటివ్ గానే వినిపిస్తాయి. ప్రస్తుతం
తమిళ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి
టాలీవుడ్ లో వస్తున్న వార్తల్లో నిజం అవుతాయో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.