మన జీవితంలో వింత సంఘటనలు జరిగినప్పుడు చాలా చిరాకు గా అనిపిస్తుంది కానీ తర్వాత కాలంలో ఆ ఘటనలను నెమరు వేసుకుంటూ నవ్వుకుంటాం. ప్రస్తుతం ప్రముఖ నేపథ్య గాయని సునీత ఉపద్రష్ట కూడా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఒక వింత సంఘటనను గుర్తుచేసుకుని బాగా నవ్వుకున్నారు. ఒక డైరెక్టర్ తో తనకు ఎదురైన ఒక వింత సంఘటన గురించి ఆమె చెప్పారు.


గతంలో సునీత ఓ హీరోయిన్ పాత్రకు గాత్రం దానం చేసేందుకు డబ్బింగ్ ధియేటర్ కి వెళ్లారు. అయితే ఆ సినిమా డైరెక్టరు సునీత ని చూడగానే మేడం అంటూ చాలా గౌరవప్రదంగా సంబోధిస్తూ ఆమెను లోపలికి ఆహ్వానించారట. "మేడమ్, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్.. నా సినిమాలో మీ చేత డబ్బింగ్ చెప్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది" అంటూ ఆ దర్శకుడు సునీత తో చెప్పుకొచ్చారట. కొంత సమయం తర్వాత సునీతను.. మేడమ్ అని సంబోధించడం మానేసి నేరుగా సునీత అంటూ పిలవడం ప్రారంభించారట. అయితే మరి కొన్ని సీన్లకు డబ్బింగ్ చెప్పిన తర్వాత సునీత ను బుజ్జి అంటూ ఆ డైరెక్టర్ పిలిచారట. దీనితో ఒక్కసారిగా అవాక్కయిన సునీత.. ఏంటి ఇతనిలా పిలుస్తున్నారు? అని ఆలోచనలో పడ్డారట.



అయితే డబ్బింగ్ విషయంలో సలహాలు చెబుతూ అరేయ్, బుజ్జి, కన్నా అని రకరకాలుగా పిలుస్తుండటం తో సునీత చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. కలిసిన మొదటి రోజే మరీ ఆ స్థాయిలో చనువుగా పిలవడంతో సునీత అక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూశారట. అయితే తన డబ్బింగ్ పనులు పూర్తి కాగానే అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారట. కరెక్షన్స్ కోసమని తనని రెండవసారి పిలవకపోవడం తో తాను బతికి పోయానని.. ఆ సంఘటన గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా ఫన్నీగా అనిపిస్తోందని సునీత అన్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో సునీత చెప్పలేదు. కనీసం చిన్న క్లూ కూడా ఆమె ఇవ్వలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: