తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప కమెడియన్ల లో సునీల్ కూడా ఒకరు. సునీల్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు. మంచి హీరో కూడా.. అలాగే ప్రస్తుతం మంచి విలన్ గా కూడా ప్రజల చేత మన్ననలు పొందుతున్నాడు. అయితే సునీల్ కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు ఎన్నో ఇబ్బందులు పడిన విషయం అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ తోపాటు ఇతర కారణాలవల్ల అనూహ్యంగా సునీల్ స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలో, సునీల్ హీరోగా అవకాశాలు రావడంతో కమెడియన్  కాస్తా హీరో అయ్యాడు . అయితే హీరోగా ఆఫర్లు వస్తున్న సమయంలో చేయడంలో తప్పులేదు. గతంలో చాలా మంది కమెడియన్స్ కూడా  హీరోలుగా చేయడం జరిగింది. కానీ వారిలో చాలామంది హీరోలుగా చేస్తూనే, మరోవైపు  కమెడియన్ గా కూడా కొనసాగారు. సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సక్సెస్ కాకుంటే కమెడియన్స్ గా కొనసాగవచ్చు అనే నమ్మకం తోనే,  కమెడియన్ లుగా, మరొకవైపు హీరోలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. సునీల్ మాత్రం ఆఫర్లు వస్తున్న సమయంలో మరో హీరోతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించలేదు..

ఇక ఒకానొక సమయంలో సునీల్ ఒక నాలుగు పెద్ద హీరోల సినిమాలను కూడా వదిలేశాడు అంటూ వార్తలు వచ్చాయి. హీరోగా సునీల్  కెరియర్ కొంతకాలం బాగున్నప్పటికీ, ఆ తర్వాత కథ మొత్తం తలకిందులైంది. హీరో గా ఆఫర్లు రాకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా మళ్లీ కమెడియన్ గా చేస్తున్న సమయంలో తిరిగి హీరోగా అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో తిరిగి హీరోగా నటించేందుకు సునీల్ ఒప్పుకోలేదు.  ఇది చాలా తప్పుడు నిర్ణయం అంటూ ఇప్పుడు తెలుసుకున్నట్లు వున్నాడు.

అందుకే ఇప్పుడు వరుసగా హీరోగా చేస్తూనే మరో వైపు కమెడియన్ గా కూడా నటిస్తున్నాడు. సునీల్ తన కెరియర్లో ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పట్లో ఒకవైపు హీరోగా, మరో వైపు కమెడియన్ గా, ఇంకొక వైపు విలన్ గా, సినీ అవకాశాలు చాలా వస్తున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: