వరుస సినిమాలు హిట్ లు కొడుతూ దూసుకుపోతున్న వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'.. నూతన దర్శకుడు కిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఈ సినిమాని అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ నిర్మిస్తుండడం విశేషం.. ఎన్నో అంచనాలమధ్య రాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకోగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తుండడం విశేషం.. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా ఆ లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది..

ఫిదా, అంతరిక్షం, తొలిప్రేమ, f2 , గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో వరుస సినిమా లు సూపర్ హిట్ గా నిలవడంతో వరుణ్ తేజ్ గతంలో ఎప్పుడు లేని విధంగా మంచి ఫామ్ లో ఉన్నాడు.. దాంతో గని సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే ఈ సినిమా వివాదాలు సినిమా భవిష్యత్ పై, వరుణ్ తేజ్ కెరీర్ పై ప్రభావం చూపేలా ఉన్నట్లు తెలుస్తుంది.  మొదటి నుంచి ఈ సినిమా కి ఇదొక రూపంలో అవాంతరం ఏర్పడుతునే ఉంది.. కరోనా నేపథ్యంలో సినిమా ఆగిపోగా దర్శక నిర్మాతల మధ్య విబేధాలు సినిమా అవుట్ ఫుట్ పై ప్రభావం చూపుతున్నాయట..

సినిమా కి బాబీ నిర్మాత కాగా సహా నిర్మాతగా అయన స్నేహితుడు సిద్దు ఉన్నారు.. వీరిద్దరికి పొసగకపోవడం మరియు దర్శకుడి కథ విషయంలో వరుణ్ పూర్తి సంతృప్తిగా లేకపోవడం వంటివి సినిమాపై ప్రభావం చూపుతున్నాయట.. మొదటినుంచి కథ విషయంలో వరుణ్ తేజ్ అసంతృప్తిగానే ఉంటున్నాడట. తరచు మార్పులు చేర్పులు చేస్తుండడంతో బడ్జెట్ పరిమితులు దాటటడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయట.. వరుణ్ తేజ్ కి మొదటి సారి ఇలా కావడంతో ఇప్పుడు అయన తదుపరి సినిమాపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు సినీ ప్రముఖులు..

మరింత సమాచారం తెలుసుకోండి: