సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో అందంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు.కేవలం 26 సినిమాలతోనే సూపర్ క్రేజ్ ఇంకా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఇక మహేష్ చేసిన సినిమాలలో ఫ్యాన్స్ కి అలాగే టాలీవుడ్ ఆడియన్స్ కి ఎంతగానో గుర్తుండిపోయే చిత్రం "అతడు".


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా ఇది.ఇక మణిశర్మ అందించిన పాటలు నేపథ్య సంగీతం ఇప్పటికి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా థియేటర్ లలో రిలీజ్ అయ్యి హిట్ కొడితే టీవీలలో ప్రసారమయ్యి రికార్డు స్థాయిలో హిట్ అయ్యింది. టెలికాస్ట్ అయిన ప్రతి సారి రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్స్ ని నమోదు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.


ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడీగా త్రిష హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మహేష్ మరదలిగా నటించిన త్రిష నటనకి ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. అంతేగాక వీరిద్దరి జంట కూడా ఆల్ టైం ఎవర్ గ్రీన్ జంటగా తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోతుంది. ఇక వీరిద్దరి మధ్య ఈ సినిమాలో సూపర్ కెమిస్ట్రీ కుదిరిందనే చెప్పాలి.ఇక వీరి మధ్య వచ్చే లవ్ సీన్లు యూత్ ని అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.


ముఖ్యంగా డోర్ లాక్ అనే సీన్ అయితే ఇప్పటికి యూత్ కి హాట్ ఫేవరేట్ అని చెప్పాలి. త్రిష కామెడీ, మహేష్ టైమింగ్ ఇలా ప్రతి సన్నివేశాన్ని త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించి వీరిద్దరి మధ్య పండించిన లవ్ రొమాన్స్ కి ఆడియన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు.వీరిద్దరినీ చూస్తే మగవాళ్లకి త్రిష లాంటి మరదలు కావాలని ఆడవాళ్లకు అయితే మహేష్ లాంటి బావ కావాలని అనిపిస్తుంది. అంతలా వీరిద్దరి జంట చూడ ముచ్చటగా ఉండి ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో.


ఎన్ని లవ్ సినిమాలు వచ్చిన కాని అవి ఈ సినిమా లవ్ సీన్ల ముందు తక్కువనే చెప్పాలి.ఇక పాటల్లో కూడా మహేష్ త్రిష జంట చూడముచ్చటగా సూపర్ గా ఉంటుంది.అటు కథలోనూ, లవ్ సీన్లలోనూ, కామెడీ లోను, యాక్షన్ సన్నీ వేశాల్లోను, ఎమోషనల్ సన్నివేశాల్లోను, ఇక పాటల విషయంలోనూ అన్నింటిలో ఈ సినిమా బాగా అలరిస్తుంది.మొత్తానికి అతడు సినిమా తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆల్ రౌండర్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా అటు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోను ఇంకా త్రిష కెరీర్ లోను ఓ మరపురాని సినిమాగా ఎన్నడూ నిలిచిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: