
టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలనటుడిగానే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తండ్రి కృష్ణ గారితో కూడా సినిమాల్లో నటించాడు.రాజకుమారుడు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు.తరువాత నమ్రత శిరోద్కర్ ని ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నారు.ఎన్నో సినిమాల్లో నటించి తండ్రికి తగ్గా తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు.అయితే మహేష్ బాబుకి ఎంత క్రేజ్ పెరిగినా కూడా పర్సనల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటారు. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఘట్టమనేని కృష్ణ వారసుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఆ వారసులు ఎవరు? ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. !
మన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు ఉన్న విషయం అందరికి తెలిసిందే.అయితే మొదటి భార్య అయిన ఇందిరకు పుట్టిన సంతానం మొత్తం ఐదుగురు. అంటే కృష్ణగారి వారసులు మొత్తం ఐదుగురు అన్నమాట. వారిలో రమేష్ బాబు,పద్మావతి, మంజుల ఘట్టమనేని,మహేష్ బాబు, ప్రియదర్శిని. అందరికన్నా చిన్న అమ్మాయి ప్రియదర్శిని. చూడడానికి సైలెంట్ గా ఉన్నా అన్న మహేష్ తో కలిస్తే మాత్రం అల్లరే అల్లరట.ఇకపోతే కృష్ణ మొదటి కూతురు పద్మావతిని పొలిటికల్ లీడర్ జయదేవ్ గల్లా వివాహం చేసుకున్నారు. ఇక రెండవ ఆమె మంజుల దర్శకురాలిగా, నిర్మాతగా, నటిగా మన అందరికి తెలిసిందే. ఇకపోతే చిన్నారి చెల్లెలు ప్రియదర్శిని హీరో సుధీర్ బాబును వివాహం చేసుకున్న విషయం మన తెలిసిందే.ప్రియదర్శిని గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా కెమెరా ముందుకు రాలేదు. ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీగా ఉంటుంది.
అయితే ఇప్పుడు ప్రియదర్శినికి సంబంధించిన ఫ్యామీలి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె భర్త సుధీర్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ట్రెడిషనల్ లుక్ లో ఫొటోషూట్ నిర్వహించారు.ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రియదర్శిని, సుధీర్ దంపతులకు ఇద్దరు మగపిల్లలు.వారి పేర్లు చరిత్ మానస్- దర్శన్.అంటే ఈ పిల్లలు ఇద్దరు మహేష్ బాబుకి మేనల్లుళ్లు అవుతారు. ఈ ఫొటోస్ లో మహేష్ బాబు మేనల్లుళ్లు ఇద్దరు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించారు. అయితే వీరిలో దర్శన్ కి మేనమామ అయిన మహేష్ బాబు పోలికలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.ఈ ఫొటోస్ చుసిన అభిమానులు కూడా అదే తరహాలో కామెంట్ చేస్తున్నారు.రాబోయే రోజుల్లో మరికొంతమంది సూపర్ స్టార్స్ రాబోతున్నారని మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.