ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో రామాయణం బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న సినిమాల హవా నడుస్తోంది. ఇప్పటికే
డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓంరౌత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్
సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ
మూవీ ప్యాన్
ఇండియా ప్రాజెక్టుగా వస్తోంది. అయితే దీనికి పోటీగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు,
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో మరో
సినిమా వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సెన్సేషనల్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ భారీ సినిమాతో వస్తున్నారు. ఆయనెవరో కాదు బాహుబలి,
ఆర్.ఆర్.ఆర్ లాంటి పెద్ద సినిమాలకు కథ రాసిన రాజమౌలి తండ్రి. ఆయన రచయితగా ఎంతో ఫేమస్. ఇప్పుడు ఆయన ఓ పెద్ద సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేయట్లేదు. కథ, స్క్రీన్ ప్లే మాత్రమే అదిస్తున్నారు. దీన్ని ప్యాన్ ఇండియాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ఇక విజయేంద్ర ప్రసాద్ కూడా రామాయణం సీత: ది ఇంకార్నేషన్ అనే
సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇది రామాయణం ఆధారంగా వస్తున్న సినిమానే. ఈమూవీకి అలౌకిక్ దేశాయి దర్శకత్వం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని సరికొత్త కోణంలో కథ ఉంటుందంట. అంతే కాదు దీంట్లో ఎన్నో ఎలిమేషన్స్ ఉంటాయని సమాచారం.
ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చూసిన
సీత క్యారెక్టర్ కాకుండా ఈ సినిమాలో సరికొత్త విధంగా
సీత క్యారెక్టర్‌ను చూపించాలని విజయేంద్రప్రసాద్ భావిస్తున్నారంట. కేవలం
సీత కోణంలో మాత్రమే
సినిమా హైలెట్ అవుతుందని సమాచారం. ఇక
సీత పాత్రలో
కరీనా కపూర్ లేదా
ఆలియా భట్ లలో ఒకరిని తీసుకునేందుకు
మూవీ టీమ్ భావిస్తోంది. రావణుడి పాత్రలో
రణ్ వీర్ సింగ్ అయితే బాగుంటుందని టీం ఆలోచిస్తోంది. ఆయన ఇప్పటికే ఇలాంటి పాత్రల్లో చేశారు కాబట్టి ఆయననే తీసుకుంటారంట. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.