ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్‌’ పేరిట వివిధ అంశాలపై మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన పెళ్లి, విడాకులు వంటి విషయాలపై మాట్లాడారు. లాక్ డౌన్ సమయం లో విడాకులు తీసుకునే దంపతుల సంఖ్య పెరిగిపోతోందని ఆయన తన మ్యూజింగ్స్‌ లో వెల్లడించారు. అయితే విడాకుల గురించి చర్చించిన ఆయన.. విడాకుల సమస్యకు పరిష్కారం ఏంటో కూడా చెప్పుకొచ్చారు. పెళ్లయిన, పెళ్లికాని వారికి ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.


పెళ్లయిన వారికి ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే.. భార్య భర్తలు ఒకరికరితో చాలా తక్కువగా మాట్లాడుకోవాలంట. అలా మాట్లాడుకోవడం వలన ఎక్కువగా గొడవలు రావని.. ఫలితంగా విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా రావని ఆయన అన్నారు. పెళ్లి అయిన వారు 30 నిమిషాల కంటే ఎక్కువ గా మాట్లాడకూడదు అని ఆయన సలహా ఇచ్చారు. 'భార్య కంటే వాట్సాప్ అప్లికేషనే బెటర్.. వాట్సాప్ లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండటం వల్ల సమయం గడిచిపోతుంది.. అలాగే ఎటువంటి గొడవలు ఉండవు.. భార్య కంటే వాట్సాపే చాలా ఆసక్తిగా ఉంటుంది" అని పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దంపతులు ఒకరికొకరు ఎదురుగా మొహాలు చూసుకుంటూ నిద్రపోకూడదని ఆయన అన్నారు.



అయితే పెళ్లికాని వారికి కూడా ఆయన కొన్ని చిత్రమైన సలహాలు ఇచ్చారు. యువత మ్యారేజ్ చేసుకునే ముందు కౌన్సిలింగ్ తీసుకోవాలని ఆయన అన్నారు. పెళ్లి చేసుకునే ఆడ, మగ ఇద్దరికీ కూడా జాబ్స్ ఉండాలి. 2040 నాటికి కేవలం 30 శాతం వివాహలు మాత్రమే జరుగుతాయని కూడా ఆయన జోష్యం విషయం చెప్పారు.



ఇకపోతే, పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటిస్తున్న ఒక పాన్-ఇండియా ప్రాజెక్ట్ "లైగర్" సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన పవన్ కల్యాణ్ తో కలిసి ఓ సినిమా చేయనున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: