కరోనా విజృంభణతో దేశంలో లాక్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో అన్ని పరిశ్రమలతో పాటు సినిమా పరిశ్రమ కూడా మూతపడింది. సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం దేశంలో క‌రోనా తగ్గు ముఖం పట్టింది. దాంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్నాయి. దాంతో ప‌రిస్థితితులు అన్నీ సాధార‌ణ స్థితికి వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు అన్ని ర‌కాల కార్యాల‌యాలు, షాపింగ్ మాల్స్ తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ లను కూడా మొదలు పెడుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. 

కాగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా షూటింగ్ లో నేడు రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హ‌కీమ్ త‌న‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ద్వారా ఈ విషయం తెలిసింది. ఆలిమ్ హ‌కీమ్... చరణ్ కు హెయిర్ కట్ చేశారు. అనంతరం ఆయనతో కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ లో హ‌కీమ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమైంది షూటింగ్ కోసం మరింత స్టైలిష్ గా మారిన రామ్ చ‌ర‌ణ్ ఇదిగో అంటూ పేర్కొన్నారు. 

ఫోటోలో చరణ్ కోరమీసాల తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్ లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదల చేసిన పలు పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. ఈ సినిమాను జ‌క్క‌న్న పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేయ‌బోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే త‌న సినిమాల‌తో అన్ని ఇండ‌స్ట్రీల‌ను షేక్ చేసిన జ‌క్క‌న్నఈ సినిమా తో ఎలాంటి రికార్డులు బ‌ద్ద‌లు కొడ‌తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: