
తాజాగా రామ్ గోపాల్ వర్మ మరోమారు తన వ్యంగత్వానికి పదును పెడుతూ.. ట్వీట్ చేశారు. తీరా అది నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ విషయమేంటంటే... కరోనా వైరస్ నూతన రూపాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరికీ అర్థం కాని రీతిలో, ఎవరూ గుర్తుంచుకోని పద్ధతిలో పేర్లు పెట్టడం తెలిసిందే. తాజాగా వర్మ ఇదే విషయం పై స్పందిస్తూ... పెద్ద, పెద్ద శాస్త్రవేత్తలు జనాలెవరికీ అర్థం కాని రీతిలో నూతన కరోనా వేరియంట్లకు Bi7172, Nk4421, K9472 ,AV415 అనే పేర్లను ఎందుకు పెడతారో అని ప్రశ్నించారు.
అలా కాకుండా నూతన వైరస్ రూపాలకు ప్యారేలాల్, చింటూ, జాన్ డేవిడ్, సుబ్బారావు లాంటి పేర్లు పెడితే బాగుంటుందని సూచించారు. ఇలాంటి పేర్లు పెడితే అర్థమవడంతో పాటు గుర్తుంచుకోవడానికి కూడా.. వీలుగా ఉంటుందన్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తల తిక్క ప్రశ్న వేశారంటూ... కొంత మంది విరుచుకుపడుతుండగా.. సరైన ప్రశ్న అడిగారంటూ వర్మ అభిమానులు మాత్రం సమర్థిస్తున్నారు. వైరల్ గా మారిన ఈ ట్వీట్ కు వేలల్లో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఎంతైనా వర్మ సినిమా తీసినా, ట్వీట్ వేసినా కూడా సంచలనమే అని పలువురు చర్చించుకుంటున్నారు.