
మన హీరోయిన్ లు వేదాంతాలు చెప్పడంలో చాలా స్పెషలిస్ట్ లు. కొన్నిసార్లు వాళ్ళు చెప్పే వేదాంతాలు చూస్తుంటే ఏ వేదాంతు పండితులు చెప్పిన కూడా అంతా ఇంపాక్ట్ అనిపించదు అనిపిస్తుంది.తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కి అద్వానీ వేదాంతం చెబుతున్నారు. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఏ గురించి ఆలోచించినప్పుడే ప్లాన్ బి ని కూడా ప్లాన్ చేయాలి అంటున్నారు కియరా..
అయితే ఈమె ఈ రకమైన వేదాంతం చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆమె భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ కి మరొక స్టార్ హీరోయిన్ దొరికిందని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత ఆమె చేసిన తదుపరి సినిమా వినయ విధేయ రామ దారుణమైన ఫ్లాప్ ను మూటకట్టుకోవడం తో ఆమెకు మళ్లీ తెలుగులో సినిమా అవకాశం ఇవ్వడానికి ఆలోచించారు మన దర్శక నిర్మాతలు. అంతకు ముందు వచ్చిన హిట్ ను పరిగణలోకి తీసుకోలేదు కానీ ఫ్లాప్ ను మాత్రం సాకుగా చూపించి ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవడానికి నిరాకరించారు మన హీరోలు.
ఫాగ్లీ అనే హిందీ సినిమా ద్వారా కియారా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి ఎంఎస్ ధోని, లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను చేసింది. అయితే తనకు ప్లాన్ బి అనే బాలీవుడ్ ఆప్షన్ ఉన్నందువల్లే ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతున్నానని ఈ ప్లాన్ బి లేకపోతే తాను ఎప్పుడో వెనుదిరిగి దాన్నని చెప్పుకొచ్చింది. ఒక చోట ఫెయిల్ అయితే ఏంటి నేను నేను ప్లాన్ బి పెట్టుకొని అక్కడ సక్సెస్ అయ్యాను. అందుకే ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ప్లాన్స్ చేసుకోవడం వారి కెరీర్ కి లైఫ్ కి ఎంతో మంచిది అని చెప్పారు. ప్రస్తుతం కీయారా అద్వాని బాలీవుడ్ లో నాలుగు పెద్ద ప్రాజెక్టులను చేస్తున్నారు. తెలుగులో శంకర్ రామ్ చరణ్ ల మూవీకి హీరోయిన్ గా ఈమెనే అనుకుంటున్నారట. మరి ఈ సినిమాతో అయినా తెలుగులో మళ్లీ ఆమె కం బ్యాక్ చేస్తుందో చూడాలి.