టాలీవుడ్ బ్యూటీ మెహరీన్ వివాహం ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణ గాడి వీర ప్రేమ కథ మూవీ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానుభావుడు కవచం చాణక్య f2 వంటి చిత్రాల్లో నటించి సక్సెస్ ను అందుకుంది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ భిష్ణోయ్ మనవడు భవ్య భిష్ణోయ తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ జరుపుకుంది.  అనంతరం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆ  వెంటనే పెళ్లి అని చెప్పి అందరినీ షాక్ ఇచ్చింది.  పెద్దింటి కోడలు అవుతుంది కదా అందుకే నటించకూడదని నిర్ణయించుకుంది అని ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు.

ఈ క్రమంలోనే  తన సంతకం చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రెడీ అయింది. గత నెలలోనే భవ్య తో తన పెళ్ళి నిశ్చయమైంది అని పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు చెప్పిన మెహరిన్ తెలిపింది.  సడన్ గా కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడినట్లు చెప్పింది. అంతేకాక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా సన్నిహితులు బంధువులు సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమె ఓ పెద్ద హీరోతో నటించే ఛాన్స్ రాగా  ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలోనే పెళ్లి పెట్టుకుని ఈ పెద్ద ప్రాజెక్టుకు ఓకే చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచినా పెళ్లికి ఇంకా చాలా గ్యాప్ ఉందేమోనని అభిప్రాయపడ్డారు.

ఏమైందో ఏమో తెలియదు గానీ ఈ శనివారం ఉదయం లేచేసరికి తన సోషల్ మీడియా ఖాతాలో భవ్య విష్ణుతో తాను నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లు పోస్టులు దర్శనమిచ్చాయి. ఇకనుంచి భవ్య కు గానీ ఆయన కుటుంబ సభ్యులతో గాని నాకు ఎలాంటి సంబంధం లేదు. అది నా ఇష్టం గా తీసుకున్న నిర్ణయం. నా వ్యక్తిగతం. ప్రతి ఒక్కరు నా నిర్ణయాన్ని ప్రైవసీని గౌరవిస్తారని అనుకుంటున్నాను. అని ఆమె పోస్ట్ చేయగా అది చూసి అందరూ షాక్ కి గురయ్యారు. పెద్ద హీరోతో సినిమా అవకాశం రావడం అది ఒప్పుకోవడమే వీరిద్దరు విడిపోవడానికి కారణం అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: