అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ "మల్లేశం" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమా తోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ ఆ తర్వాత "ప్లేబ్యాక్" సినిమాతో అభిమానుల సంఖ్యను మరింత పెంచుకుంది. ఆ తర్వాత "వకీల్ సాబ్" చిత్రంతో తన క్రేజ్ ను అమాంతం పెంచేసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె ఫోటో షూట్ల సందడి అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది ఈ వయ్యారి భామ. ఎంతో గ్లామరస్ గా కనబడుతూ అభిమానులకు అందాల విందు ఇస్తోంది.  అయితే వకీల్ సాబ్ మూవీ తరవాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి స్టార్ హీరోతో చేయబోతోందట అనుష్క లాగా నడుమున్న ఈ సుందరి.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..?? మాస్ మహారాజా రవితేజ అని వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఖిలాడి సినిమాతో బిజీగా ఉండగా, తదుపరి శరత్‌ మండవతో ఓ  సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మ‌జిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా అనన్య నాగళ్ళ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు సంబంధించిన పాత్రలు ఉన్నాయని, అందులో ఒకరు దివ్యాంక మరొకరు అనన్య నాగళ్ళ అంటూ ప్రచారం జరుగుతోంది. దివ్యాంక హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించారు కానీ, అనన్య  నాగళ్ళ మరో హీరోయిన్ గా చేస్తుంది అన్న వార్తపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.

  ప్రస్తుతం ఈ విషయం అనన్య అభిమానులకు మరియు సన్నిహితులకు సంతోషాన్నిస్తోంది. ఈ వార్త నిజమయితే ఇంకా అనన్య నాగళ్లను మంచి రోజులు మొదలయినట్టే. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో. ఇది కాకుండా మరికొన్ని సినిమాలలోనూ అవకాశాలు వచ్చినా ఈమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: