
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ లు టాలీవుడ్ కు దొరికారు. దశాబ్దకాలంగా ఈ షో పండిస్తున్న కామెడీ అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయిన ఈ షో ఇప్పుడు ప్రారంభ మైందో తెలియదు కానీ చాలా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ షోలో పాల్గొనే నటీనటులు తమ జీవితాల్లో సెటిల్ అయిపోయారు. ఆహ్లాదకరమైన హాస్యంతో పాటు ప్రేక్షకులను ఎంతో వినోద పరుస్తూ వస్తున్న ఈ జబర్దస్త్ వల్ల అందరికీ మేలు జరుగుతుంది.
ఇక వీరు సొంత యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకొని చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తమ జీవితంలోని ప్రతి ఒక్క విశేషాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తూ వారు అటు క్రేజ్ పరంగా ఇమేజ్ పరంగా రోజు రోజు కి తమ బ్రాండ్ ను పెంచుకుంటూ పోతున్నారు. . ఇక ఈ షోలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు నరేష్. హైటు తక్కువ అయినా కామెడీ పండించడంలో మాత్రం చాలా గట్టోడు. కనిపించడానికి చిన్నపిల్లాడి లా ఉన్న కూడా ఆయన ప్రతి ఒక్కరిని పొట్టచక్కలయ్యే విధంగా నవ్విస్తాడు.
జబర్దస్త్ షో లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకునీ దూసుకుపోతున్న ఈ కుర్ర కమెడియన్ కు ఓటు హక్కు కూడా ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం లో పుట్టి పెరిగిన నరేష్ చిన్నప్పటినుంచి ఎదుగుదల లోపం తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు 22 సంవత్సరాల వయస్సు అంటే నమ్మడం కష్టమే. 1999వ సంవత్సరంలో పుట్టిన నరేష్ ఢీ జూనియర్స్ కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీం లో జాయిన్ చేశాడు. నరేష్ వయసు గురించి చాలా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ స్క్రిప్ట్ లో భాగంగా తన వయసు 22 అని ఒప్పేసుకున్నాడు.