
ఎలాంటి పరిస్థితుల్లో అయినా సినిమాను ప్రాణం గా భావించి సినిమాలు చేసే హీరోలు మన టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. స్వయంకృషితో వచ్చినా బ్యాక్గ్రౌండ్ తో హీరోగా వచ్చినా కూడా సినిమాపై ప్యాషన్ ఉంటే వారు సక్సెస్ అవుతారు అనేదానికి ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలు నిదర్శనం. వీరిలో మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఎంత కష్టపడతారో సినిమా అంటే ఎంత ఫ్యాషన్ చూపిస్తారో అనేది మనందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు ప్రేక్షకులను మెగాస్టార్ చిరంజీవి గా ఎదిగి అలరిస్తున్నారు అంటే ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
ఆయనకు సినిమాపై ఉన్న ఇష్టం ఫ్యాషన్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఉదాహరణ నిదర్శనం. యాక్షన్ హీరోగా అవతరించిన తొలినాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి కిరాయి రౌడీలు కిరాతకుడు అనే యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి ఈ తరహా సినిమాలు చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఈ సినిమాలలో యాక్షన్ సీన్ లు ఎంతో రిస్కుతో కూడుకున్నది కాబట్టి చిరంజీవి చేసే యాక్షన్ సీక్వెన్స్ ల విధానం చూసి డైరెక్టర్ లు సైతం భయ పడ్డారట.
ఆ విధంగా ఆయన చేసిన హిందీ సినిమా ది జెంటిల్ మెన్ సెట్స్ పైన జరిగిందట. అర్జున్ హీరోగా శంకర్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ ను బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ దర్శకత్వంలో లో చిరంజీవి హీరోగా చేస్తుండగా ఆ సినిమాలోని ఒక సీన్ చిరంజీవి చేతిలో భుజం కింద బుల్లెట్ దూసుకుపోతుంది. ఒక రాడ్ కు స్పిరిట్ ముంచిన దూదిని చుట్టి దానితో బుల్లెట్ తగిలిన చోట వెనకవైపు నుంచి ఆ రాడ్ తో పొడస్తాడు చిరంజీవి. దాంతో బుల్లెట్ బయటకు వస్తుంది. ఆ గాయాన్ని మాన్పడానికి గన్ పౌడర్ గాయం మీద వేస్తే అది కాకర పువ్వాత్తి లా వెలుగుతుంది. దీంతో గాయం త్వరగా మానుతుంది. ఉంటే అది జరుగుతుంది. ఇది దర్శకుడు మహేష్ భట్ చిరంజీవితో చేయవద్దని చెప్పగా చిరంజీవి తాను చేస్తానని చెప్పి చేశాడు. ఆ సీన్ తద్వారా ఎంతో బాగా పండి సినిమా హిట్టు దోహదపడింది. ఇవే కాదు ఇలాంటి సంఘటనలు ఎన్నో రిస్క్ లు చేసి చిరంజీవి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు.