బాహుబలి
సినిమా తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది అనుష్క. ఆ తర్వాత ఆమె
హీరోయిన్ గా భారీ భారీ చిత్రాలు చేస్తోంది అనుకున్నారు కానీ అప్పటికే ఆమె కెరీర్ చరమాంకంలో ఉండటంతో ఆమెకు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో అవకాశాలు తప్ప పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు అసలు రావడం లేదు. దాంతో ఆమె కెరీర్ పూర్తిగా అయిపోయినట్లే అనుకున్నారు.
భాగమతి , నిశబ్దం సినిమాల తర్వాత ఆమె ఏ తెలుగు
సినిమా కూడా ఒప్పుకోలేదు. దాంతోనే
అనుష్క కెరీర్ కూడా అయిపోయింది అని నిరుత్సాహంలో ఉన్నారు ఆమె అభిమానులు. కానీ
నవీన్ పోలిశెట్టి తో ఓ విభిన్నమైన చిత్రం
అనుష్క చేయబోతుంది అని తెలియగానే ఆమె అభిమానులు ఎంతగానో సంతోషపడ్డారు.
ఇటీవల నవీన్ తన తదుపరి చిత్రం
అనుష్క శెట్టి
హీరోయిన్ గా
లవ్ స్టోరీ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందనీ, ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ ఎంతకీ ఈ
సినిమా మొదలు కాకపోవడంతో అసలు ఈ
సినిమా ఉన్నట్టా లేనట్టా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. ఏజెంట్ సాయి శ్రీనివాస
ఆత్రేయ సినిమాతో హీరోగా మారిన
నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు హిట్ కొట్టి చాలా రోజులు అవుతున్నా ఇంకా తదుపరి చిత్రాన్ని లైన్ లో పెట్టకపోవడంతో ఆయన అభిమానులు కూడా
నవీన్ పోలిశెట్టి తదుపరి
సినిమా ఏంటి అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
సూపర్ సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన
అనుష్క ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం అవకాశాలు దక్కించుకోవడానికి ఎంతో కష్టాలు పడుతుంది. లేడీ ఓరియంటెడ్
సినిమా లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె ఆ తరహ సినిమాలను రాబట్టుకోవడంలో కూడా ఫెయిల్ అయింది. దాంతో ఈమె కెరీర్ దాదాపు అయిపోయినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి
నవీన్ పోలిశెట్టి తో
సినిమా వర్కవుట్ అయితేనన్నా ఆమె కెరీర్ మళ్లీ గాడిలోకి వస్తుందో చూడాలి.