తెలుగు తెరపై తారా జువ్వల్లా మెరిసి అందరి దృష్టిని ఆకర్షించి అనూహ్యంగా అలా తళుక్కుమని మాయమై పోతుంటారు కొందరు నటీనటులు. అలా ఒకప్పుడు యూత్ ను తన నటనతో ఆకట్టుకున్న హీరో రోహిత్ మీకందరికీ గుర్తు ఉండే ఉంటాడు. జానకి వెడ్స్ శ్రీరాం, 6 టీన్స్ వంటి పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోగా నటించి అభిమానులను పెంచుకున్నాడు రోహిత్. హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. కానీ ఆ తరువాత కొంతకాలం సినిమా ఇండస్ట్రీ నుండి కనుమరుగై పోయాడు. మళ్లీ అనూహ్యంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించాడు. అయితే అవకాశాలు కాస్త సన్నగిల్లడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు ఈ టాలెంటెడ్ హీరో.
ఈ మధ్య ఒకసారి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం మళ్ళీ వెండి తెరపై తిరిగి సత్తా చాటేందుకు దూసుకొస్తున్నాడు రోహిత్. అయితే సాధారణంగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చాలా మంది స్టార్ హీరోలు సైతం సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేటప్పటికీ రూటు మార్చి క్యారక్టర్ ఆర్టిస్ట్ లుగానూ, విలన్ల గానూ రీఎంట్రీ ఇచ్చి వైవిధ్యంగా కొనసాగిస్తుంటే ఈ హీరో మాత్రం మళ్ళీ హీరో గానే చక్రం తిప్పాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. కళాకార్ సినిమాతో తిరిగి హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ చూస్తుంటే ఇందులో రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇంతకాలం తర్వాత మళ్లీ హీరోగానే రాబోతున్న రోహిత్ ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. ఇన్నాళ్ళ తర్వాత రీ ఎంట్రీ అంటే హీరోగా కాకుండా క్యారక్టర్ ఆర్టిస్ట్ గానో, లేదా విలన్ గానో కాస్త బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట కొందరు నెటిజన్లు. మరి ఈ మేరకు ప్రేక్షకులు రోహిత్ ని ఆదరిస్తారో చూడాలి...

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి