హన్సికా బాలీవుడ్ లో బాలనటిగా మెప్పించిన ఆమె టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయింది.తొలి సినిమా దేశముదురుతోనే కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది. ఆ తరువాత దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక కొంతకాలం నుండి తెలుగులో అవకాశాలు తగ్గినా తమిళంలో మాత్రం ఒక  వెలుగు వెలుగుతుంది.17 ఏళ్ల క్రితం సినిమాలోకి వచ్చిన హన్సికా అప్పుడే 50 సినిమాల మార్క్ దాటేసింది.ఆమె 50వ చిత్రం మహా తెలుగులో మంచి సినిమాలు రాకున్నా తమిళంలో మాత్రం తన టాలెంట్ నిరూపించుకుంది.హన్సిక కేవలం నటన పరంగా కాకుండా మానవత్వంగల అమ్మాయిగా హన్సికనువ్వు మెచ్చుకోవాల్సిందే.ఎందుకంటే తన ప్రతి పుట్టినరోజుకి ఒక  అనాధ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకొని చదివిస్తాను అని తెలియజేసింది.హన్సిక చాలా సీరియల్స్ లోను సినిమాలలోనూ చిన్నతనం నుంచే నటిస్తుంది.2001 నుంచే  షకళక భూమ్ భూమ్ వంటి సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.అలాగే కోయి మిల్ గయా వంటి సినిమాల్లో కూడా నటించింది.2007 లో తెలుగులో పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన దేశముదురు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.టాలీవుడ్ మొదటి సినిమాతో హిట్ కొట్టడమే కాకుండా అందరి  దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.తన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది. తరువాత  ఎన్టీఆర్ తో కంత్రి సినిమాలో నటించింది.కానీ  ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఇంక అప్పటి నుంచి  హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా  సినిమాలు చేస్తుంది.తెలుగులో హిట్స్ దక్కక పోవడంతో తమిళ్ లోప్రయత్నాలు జరిపింది.హీరో విజయ్ సరసన  వేళయుధం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంక తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయిపొయింది. అప్పుడప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేస్తుంది. వయసు పెరిగే కొలది ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.తెలుగులో అస్సలు అవకాశాలు రావటంలేదు. తమిళ్ లో వచ్చిన ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తను 105 మినిట్స్ అనే విభిన్న కథాంశంతో  మూవీ చేస్తుంది. ఈ సినిమా ప్రత్యేకత  ఏమిటంటే ఈ సినిమా నిడివి 105 నిముషాలు ఉంటుందట. ఇదే కాకుండా ఎడిటింగ్ లేకుండా ఈ సినిమాను తీయబోతున్నట్లు సమాచారం అందింది.ఒక ఇంట్లో జరిగే  సంఘటనలతో సాగె సైకాలజికల్ థ్రిల్లర్గా సినిమా తెరకెక్కుతుంది. ఈ సైమకు రాజా దుస్సా దర్శకత్వం  వహిస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమాతో అయిన హన్సికకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: