దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఈ సినిమా పేరు చెబితే చాలు హైప్పెరిగిపోతూ ఉంటుంది . అయితే ఒక్కసారైనా రాజమౌళి సినిమాలో అవకాశం దక్కించుకోవాలని అని భావిస్తూ ఉంటారు హీరోహీరోయిన్లు   ఇక ఒక్కసారి జక్కన్న సినిమాలో అవకాశం దక్కింది అంటే ఇక స్టార్ రెంజ్ సంపాదించవచ్చు అని భావిస్తూ ఉంటారు. అందుకే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు వివిధ ఇండస్ట్రీలలో ని ఏ స్టార్ హీరో ని అడిగిన రాజమౌళి సినిమాలో అవకాశం వస్తే చిన్న పాత్ర అయినా చేయడానికి సిద్ధం అంటూ సమాధానం చెబుతూ ఉంటారు.



 మరీ ముఖ్యంగా బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత రాజమౌళి సినిమా అంటే మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి  దీంతో ఒకప్పుడు జక్కన్న సినిమాలో కీలక పాత్ర దొరకాలి అని ఆశ పడిన వారు ఇక ఇప్పుడు చిన్న పాత్రయినా చేయడానికి రెడీ అని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం జక్కన్న సినిమా నుంచి ఆఫర్ వస్తే ముఖం మీదే నో చెప్పేసిందట. ఆమె ఒక సీనియర్ హీరోయిన్. ఒకప్పటిలా వరుస అవకాశాలు రావడం లేదు.. ఇక కొన్ని సినిమాల్లో అక్కడక్కడా మెరుస్తుంది.  అయినప్పటికీ జక్కన్న సినిమాలో ఆఫర్ వస్తే నో అంటూ కరాఖండిగా చెప్పేసిందట ఆ ముద్దుగుమ్మా .



 ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా ఉన్నా తమన్న అడపాదడపా అవకాశాలు అందుకుంటోంది  స్టార్ హీరోల సినిమాలో ఐటెం సాంగ్స్ చేస్తూ మెరుస్తోంది   అయితే ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో ఒక చిన్న పాత్ర కోసం అడిగితే నో అని చెప్పినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది   ఎందుకంటే బాహుబలి సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది.  మొదటి పార్ట్ తమన్నా పాత్ర ఎంతో కీలకం.. కానీ రెండవ పార్ట్ లో మాత్రం అసలు తన పాత్రకి ఎక్కడ స్కోప్ లేకుండా పోయింది   దీంతో తమ ఇలాంటి పాత్ర చేసింది ఏంటి అంటూ ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి.  అందుకే బాహుబలిలో ఫూల్ అయ్యా అని ఇక ఇప్పుడు మళ్ళీ అవ్వొద్దు అనే ఉద్దేశంతోనే తమన్నా ఆర్ఆర్ఆర్ సినిమా లో అవకాశం వచ్చినా నో చెప్పినట్లు  టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ లో.

మరింత సమాచారం తెలుసుకోండి: