తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారిగా హను రాఘవపూడి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ మెహ్రీన్ పీర్జాదా. ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నటిగా తన ఆకట్టుకునే అందం, నటనతో ఆడియన్స్ ని అలరించిన మెహ్రీన్ అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇక ఇటీవల శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు, నాగశౌర్య హీరోగా నటించిన అశ్వద్ధామ, అలానే రవితేజ నటించిన రాజా ది గ్రేట్, ఇక కొన్నాళ్ల క్రితం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తీసిన ఎఫ్2 వంటి సినిమాలతో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం మరొక మూడు ప్రాజక్ట్స్ చేస్తూ యువతలో బాగా క్రేజ్ దక్కించుకుని కొనసాగుతున్నారు మెహ్రీన్. ఇక ఇటీవల తనకు భవ్య బిష్ నోయ్ తో జరిగిన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందని, ఇకపై తన దృష్టి అంతా సినిమాల పైనే అంటూ ఫ్యాన్స్ కి తెలిపిన మెహ్రీన్ తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఉంటారు.

ఇక అసలు విషయం లోకి వెళితే, కొద్దిసేపటి క్రితం ట్రెండీ వైట్ కలర్ డ్రెస్ లో దిగిన లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు మెహ్రీన్. అయితే ఆ ఫొటోల్లో ఆమె ఎంతో స్లిమ్ గా కనపడడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతూ, ఇటీవల సినిమా హీరోయిన్స్ అందరూ కూడా ఇలా మరీ సన్నగా నాజూగ్గా తయారవుతూ తమ సహజ అందాన్ని కోల్పోతున్నారని, వారి జాబితాలో అబ్బా నువ్వు కూడా చేరావా మెహ్రీన్ అంటూ ఆమె ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు ... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: