
టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదగడం అంటే అంత సామాన్యమైన విషయమేం కాదు ఎందుకంటే ఎంతో మంది గొప్ప గొప్ప దర్శకులు తెలుగు సినిమా చరిత్రను మార్చి గర్వించదగ్గ సినిమాలను చేశారు వాటిని దాటి గొప్ప హిట్ సాధించాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆ విధంగా ఈ తరంలో అంతటి అద్భుతమైన అమూల్యమైన గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే దర్శకధీరుడు రాజమౌళి పేరు తప్పకుండా చెప్పాలి. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన పొరపాటు చేయకుండా అన్ని సినిమాలను సూపర్ హిట్ చేసుకుంటూ టాలీవుడ్ స్థాయిని మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చాడు.
ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా దగ్గర్నుంచి నిన్నటి బాహుబలి 2 వరకు రాజమౌళి ప్రతి సినిమా ఓ శిల్పంలా ఉంటుంది. బాహుబలి సినిమా తో టాలీవుడ్ స్థాయిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేయడం ప్రతి ఒక్కరూ మొదలుపెట్టారు. ఈ ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మరో అద్భుతమైన కళాఖండం రూపొందబడుతుంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకులుగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చూస్తుంటే రాజమౌళి మరొకసారి తనదైన మార్కుతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారని అర్థమవుతుంది. గతంలో తన సినిమాలను ఎవరూ చేయని విధంగా ప్రమోట్ చేస్తూ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చూస్తారు. అలానే ఈ సినిమాకి కూడా అద్భుతమైన ఫ్రెండ్షిప్ పాటను ముందుగా విడుదల చేసి సినిమాపై క్రేజ్ ను క్రియేట్ చేశారు. సినిమాలో రామ్ చరణ్ తారక్ ల మధ్య స్నేహానికి ప్రతీకగా ఈ పాట రూపొందించినట్లు అర్థమవుతుంది. తెలుగులో హేమచంద్ర, హిందీలో అమిత్ త్రివేది, తమిళంలో అనిరుద్, కన్నడలో యాసీన్ నజీర్, మలయాళంలో విజయ్ ఏసుదాసు ఈ పాటను ఐదు భాషల్లో పాడారు. మరి రాజమౌళి నుంచి భవిష్యత్తులో ఇంకెన్ని వెరైటీ ప్రమోషన్ కార్యక్రమాలను చూడాలో మరి.