ఇక సేవా కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే అన్నదానం ,రక్త దానం వంటి శిబిరాలు ఎన్నో ఏర్పాటు చేసి, చిరంజీవి పై తనకున్న ప్రేమను చాటుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు. ఇక అందులో భాగంగానే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా, మెగాస్టార్ కు సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మన కామెడీ స్టార్ హీరో సంపూర్ణేష్ బాబు. ఇప్పటివరకు హృదయకాలేయం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో, హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఎన్నో సినిమాలు చేస్తూ, తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాడు.
ఇకపోతే ఇటీవల వచ్చిన కొబ్బరి మట్ట చిత్రం బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించింది. బర్నింగ్ స్టార్ గా పిలిపించుకునే సంపూర్ణేష్ బాబు నటిస్తోన్న, సరికొత్త మూవీ కి కూడా "బజార్ రౌడీ " అనే టైటిల్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రం కూడా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవడంతో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రం యూనిట్ సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 వ తేదీ కాగా, ఒక రెండు రోజులు ముందు ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో చిరంజీవి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందివ్వాలని చూస్తున్నాడు సంపూర్ణేష్ బాబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి