సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సినిమా నుంచి మల్టీస్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ వచ్చింది. తరువాత కొన్న కొన్ని సినిమాలు వచ్చినా అవి ఆదరణకు నోచుకోలేదు. కొన్ని సినిమాలు హిట్ అయినా అంతగా పేరు రాలేదు. దాంతో మళ్లీ సోలో హీరోల వైపే మొగ్గుచూపారు మన హీరోలు. కానీ ఈ మధ్యకాలంలో మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు ట్రెండ్‌గా మారాయి. స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానా కలిసి ఒక తమిళ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. మరోవైపు వరుణ్ తేజ్, వెంకటేష్ కూడా "ఎఫ్ 3" సినిమాతో బాగా బిజీ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం మరో ఇద్దరు స్టార్ హీరోలు సైతం ఒకే సినిమాలో చేయడానికి సిద్ధమయ్యారు. ఎవరో కాదండోయ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ప్రభాస్ హీరోలుగా ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
యు.వి.క్రియేషన్స్ ప్రభాస్ కు ఒకరకంగా ఆయన సొంత ప్రొడక్షన్ బ్యానర్ లాంటిదే. మరో వైపు రామ్ చరణ్ తో సైతం యు.వి.క్రియేషన్స్ కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక యువ దర్శకుడు యు.వి.క్రియేషన్స్ కు ఒక మంచి ప్రేమకథను వినిపించారు. ఆ కథ నిర్మాతలకు చాలా బాగా నచ్చిందట. ఆ సినిమాలో హీరోలుగా ప్రభాస్ మరియు రామ్ చరణ్ నటిస్తే చాలా బాగుంటుందని యు.వి.క్రియేషన్స్ ఒక అంచనా వేస్తుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు సైతం ఈ
సినిమా కచ్ఛితం గా ఒప్పుకుంటారని యు.వి. క్రియేషన్స్ భావిస్తోంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ "ఆర్ఆర్ఆర్" చిత్రంతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కూడా రాధే శ్యామ్, సలార్ లాంటి భారీ చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరి వీరిద్దరితో
సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.