ప్రస్తుతం ప్రేక్షకుల పంథా మారింది. ఈ క్రమంలోనే ఇక సినిమా కథ బాగుండాలే కానీ కొత్త హీరోలకు కూడా బ్లాక్బస్టర్ విజయాలను అందిస్తున్నారు.  దీంతో ఎంతోమంది కొత్త హీరో హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలలో 'కనబడుట లేదు' అనే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా టైటిల్ తోనే అటు ప్రేక్షకులను ఆకర్షించింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించడం గమనార్హం.


 మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా హీరోయిన్ వైశాలి రాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు తీసుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది  అన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు హీరోయిన్ వైశాలి రాజ్. అంతేకాదు ఇక తనకు ఈ సినిమాలో ఛాన్స్ రావడానికి గల కారణం కూడా తెలిపింది. తన అసలు పేరు కవిత అని అంటూ చెప్పుకొచ్చారు. నాన్న  చనిపోయిన తర్వాత ఇక షార్ట్ ఫిలింలో నటించడం మొదలు పెట్టాను అంటూ తెలిపింది హీరోయిన్. ఇక 'కనబడుట లేదు' అనే సినిమాలో ఛాన్స్ రావడానికి కూడా ఒక షార్ట్ కారణం అంటూ తెలిపింది. షార్ట్ ఫిలింలో ఒక ఫోటో చూసి దర్శకుడు బాలరాజు గారు 'కనబడుట లేదు' సినిమాలో అవకాశం ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్  వైశాలి రాజ్. ఇక ప్రస్తుతం మరికొన్ని కథలు వింటున్నానని..  త్వరలో మరీ కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: