మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెగాపవర్ సార్ రామ్ చరణ్. పూరి జగన్నాథ్ తీసిన ఈ సినిమాలో నేహా హీరోయిన్ గా నటించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న మెగాపవర్ స్టార్, ఆ తరువాత దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తో చేసిన సినిమా మగధీర. ఇక ఈ మూవీ విడుదల తరువాత ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.

ఇక అక్కడి నుండి హీరోగా ఒక్కో సినిమాతో బాగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు చరణ్. ఇటీవల చరణ్ తో సుకుమార్ తీసిన రంగస్థలం సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో పాటు హీరోగా రామ్ చరణ్ కి మరింతగా పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతమ్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు చరణ్. అయితే మొదటి నుండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల చరణ్ కి తన తండ్రి చిరంజీవి అంటే అమితమైన ప్రేమాభిమానం. తరచు తన ఇంటర్వూస్ లో మెగాస్టార్ గురించి ఎంతో గొప్పగా చెప్పే చరణ్, నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఒక చిన్న వీడియో బైట్ విడుదల చేసారు.

తొలిసారిగా తండ్రి మెగాస్టార్ తో కలిసి ప్రస్తుతం తాను చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ స్పాట్ లోని కొన్ని సీన్స్ ని వీడియో గా మలిచిన చరణ్, ఆయనతో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది అని, అటువంటి గొప్ప తండ్రి దొరకడం తన అదృష్టం అంటూ భావోద్వేగంగా సాగిన ఆ వీడియో ద్వారా తన మనసులో తండ్రి పై గల ప్రేమను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వ్యక్తపరిచారు చరణ్. కాగా ఆ వీడియో చూసిన పలువురు మెగాఫ్యాన్స్, తండ్రి మెగాస్టార్ పై ఇంత గొప్పగా ప్రేమను దాచుకున్న నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు లభిస్తుందని అతడిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు ....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: