‘ఆర్ ఆర్ ఆర్’ మొదలైన తరువాత చరణ్ జూనియర్ లకు ప్రమాదాలు జరిగాయి. ఆతరువాత రాజమౌళి చరణ్ జూనియర్ లకు కరోనా కూడ వచ్చి తగ్గింది. దీనితో జక్కన్న తన టీమ్ సభ్యుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో ఊహించని విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ ఒలీవియా లేటెస్ట్ గా చేసిన సాహసం జక్కన్నకు ఖంగారు పెట్టిందట. ఈమూవీలో జూనియర్ ను అభిమానించి బ్రీటీష్ బ్యూటీగా నటిస్తున్న ఒలీవియా ఈమూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈమూవీ డబ్బింగ్ పనులు హైదరాబాద్ లో జరుగుతున్న పరిస్థితులలో ఒలీవియా భాగ్యనగరంలో ఉంటోంది.


ఆమెకు ఈమధ్య భాగ్యనగరాన్ని ఒక చుట్టుచుట్టి చూడాలి అన్న కోరిక కలగడంతో ఆమె కోరికను గ్రహించిన రాజమౌళి ఆమెకు తోడుగా కాస్ట్యూమ్ డిజైనర్ అనురెడ్డిని పంపించి ఆమెకు హైదరాబాద్ చూపించే బాధ్యతను తీసుకున్నాడట. ఇందులో భాగంగా ఆమె ఆదివారం హైటెక్ సిటీ వద్దనున్న శిల్పారామానికివెళ్ళింది. అక్కడి గ్రామీణ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి ఆతరువాత బయటకు వచ్చి వీధిల్లో తిరుగుతూ రకరకాల చిరుతిళ్ళు ముఖ్యంగా పానీపూరి రెండు మూడుసార్లు తిన్నానని తన సోషల్ మీడియా పేజ్ లో తన అనుభవాన్ని షేర్ చేసింది.  


దీనితో కొందరు నెటిజన్లు ఆమె పై జోక్స్ వేస్తున్నారు. తిరగడం వరకు ఒకే కాని రోడ్ సైడ్ ఫుడ్ తినేడప్పుడు జాగ్రత్తలు తీసుకున్నావా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా విదేశస్థులకు మన భాగ్యనగరంలో దొరికే స్ట్రీట్ ఫుడ్స్ పడవని అందువల్ల ఆమెకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటి అంటూ జోక్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల టెన్షన్ లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒలీవియా కు ఏమైనా జరిగితే జక్కన్న ఈ కొత్త టెన్సన్స్ ఎక్కడ పడతాడు అంటూ ఆమెకు జాగ్రత్తలు చెపుతూ నెటిజన్ల ట్రోలింగ్ పెరిగింది..



మరింత సమాచారం తెలుసుకోండి: