
కాగా వాటిలో ఇప్పటికే రానా తో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ శరవేగంగా షూట్ జరుపుకుంటుండగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అలానే క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు మూవీ లో ఒక వజ్రాల దొంగగా పవన్ కనిపించనున్నట్లు టాక్. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వీటితో పాటు ప్రఖ్యాత టాలీవుడ్ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ తో ఒక సినిమా, అలానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న మరొక సినిమాలో కూడా పవర్ స్టార్ త్వరలో యాక్ట్ చేయనున్నారు.
అయితే ఈ విధంగా సినిమాలతో పాటు అటు రాజకీయాల్లో కూడా పాల్గొంటూ పవన్ చేస్తున్న ప్రయాణం సరైంది కాదనేది ఆయన అభిమానుల్లో కొందరి భావన. అయితే మరికొందరు చెప్తున్న దాన్ని బట్టి సరిగ్గా ప్లానింగ్ ఉంటె అటు సినిమాల తో పాటు ఇటు రాజకీయాల్లో కూడా కొనసాగవచ్చని, అలానే తప్పకుండా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు, రాజకీయాలు రెండిటిలో మరింతగా గొప్ప పేరు దక్కించుకుని ముందుకు దూసుకెళ్లడం ఖాయం అని పలువురు పవన్ ఫ్యాన్స్ నేడు ఆయన జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలతో పాటు ముందస్తుగా ఆయన కెరీర్ కి అభినందనలు తెలియచేస్తున్నారు.