నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాను మాస్ చిత్రాల తీయటంలో దిట్ట అయిన బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మె్న్స్ ఊహించని లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదల అయిన టీజర్లు చూస్తే ఇట్టే అర్థం అవుతున్నట్లు సమాచారం. షూటింగ్ ముగించుకున్న అఖండ చిత్రం విడుదల విషయంలో మాత్రం క్లారిటీ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అని వారందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. అయితే దసరా పండుగ బరిలో ఈ సినిమాను విడుదల చేస్తారని అందరూ అనుకున్నారని తెలుస్తుంది. కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా సమయం తీసుకుంటుండటంతో ఈ సినిమాను ఇప్పట్లో విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తుంది. దీంతో ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ పరిశ్రమ వర్గాల్లో టాక్ వినిపిస్తోందని తెలుస్తుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో పలు బడా చిత్రాలు విడుదల తేదీలని ప్రకటించినట్లు తెలుస్తుంది.ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ జనవరి 12నవిడుదల కాబోతుందని అందరికి తెలుసు. అలాగే సూపర్ స్టార్ మహేష్ నటించిన సర్కారు వారి పాట జనవరి 13న విడుదలకు సిద్ధం అవుతుందని అదేవిధంగా రాధేశ్యామ్ జనవరి 14న విడుదలకు రెడీ అయ్యాయని తెలుస్తుంది.

మరి ఈ విధమైన పోటీలో అఖండ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా తమ అభిమాన నటుడి చిత్రం సంక్రాంతి బరిలో విడుదల చేస్తే బాగుంటుందని వారు అంటున్నట్లు సమాచారం.మరి ఇంతటి పోటీని తట్టుకుని అఖండ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: