అనుష్క' పెళ్లి పై వచ్చినన్ని పుకార్లు మరో హీరోయిన్ పెళ్లి పై రాలేదని తెలుస్తుంది. గత పదిహేను సంవత్సరాలుగా అనుష్క పెళ్లి పై పుకార్లు వస్తూనే ఉన్నాయని తెలుస్తుంది.ఎప్పుడో పూర్వికులు చెప్పిన సామెత ప్రకారం సహజంగా 'కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు, కానీ స్టార్ హీరోయిన్ అనుష్కకు మాత్రం ఆ కళ్యాణ ఘడియలు ఎందుకు రావడం లేదో అర్ధం కావట్లేదట.

అసలు అనుష్క ఎందుకు పెళ్ళికి దూరంగా ఉంటుంది.అనుష్క - ప్రభాస్ మధ్య నిజంగానే ప్రేమ కథ నడుస్తోందా లేక ఇంకెవరితోనైనా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉందా అని సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి పై కామెంట్స్ ఇలా విపరీతంగా వస్తున్నాయట.

మొత్తానికి అనుష్క పెళ్లికి ఉన్న భారీ డిమాండ్ ను గ్రహించిన ప్రముఖ జ్యోతిష్కుడు అయిన పండిట్ జగన్నాథ్ గురూజీ  అనుష్క వివాహంపై సంచలన చేసి మొత్తమ్మీద నెట్టింట వైరల్‌ అయ్యాడని తెలుస్తుంది. అనుష్కకి సినిమా పై అంకితభావం ఎక్కువ అని అలాగే అనుష్క ముఖ కవళికలను బట్టి చూస్తే ఆమె సినీ పరిశ్రమ వ్యక్తిని కాకుండా, సినిమాలకు సంబంధం లేని బయటి వ్యక్తిని అనుష్క పెళ్లాడుతుందని చెప్పారట. అలాగే 2023 లోపు అనుష్కకు వివాహం జరుగుతుందని కూడా పండిట్ జగన్నాథ్ చెప్పుకొచ్చాడని తెలుస్తుంది.

ఇక పనిలో పనిగా ఈ పండిట్ జగన్నాథ్ మరికొన్ని కామెంట్స్ చేసాడని సమాచారం. 'అనుష్క చాలా డౌన్‌ టూ ఎర్త్‌ మనిషి అని అనుష్కలో కొంచెం కూడా అహంభావం అనే మాటే ఉండదు' అంటూ తెలిపారని సమాచారం. ఇలా ఎవరు ఎన్ని రకాల కామెంట్స్ చేసినా అనుష్క మాత్రం తన వివాహం విషయంలో పెద్దగా స్పందన కూడా తెలియజేయడానికి ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది.

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వస్తున్నాయని తెలుస్తుంది. అలాగే అనుష్క మరో లేడి ఓరియెంటెడ్ సినిమా అయిన చంద్రముఖి సీక్వెల్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తున్నట్లు సమాచారం.

మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఈ వార్త మాత్రం అయితే వైరల్ అయిందని తెలుస్తుంది. ఏది ఏమైనా అనుష్క మాత్రం బాహుబలి సినిమాతో దేవసేనగా పాన్ ఇండియా స్థాయిలో లో ఎదిగిన ఆమె స్థాయి ఆఫర్స్ రావట్లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: