టాలీవుడ్ లో ఒక హీరోతో ఒక సినిమాకు చేయడమే చాలా కష్టం. అందులోనూ పెద్ద హీరోలతో సినిమా అంటే ఇంకా కష్టం. అలాంటిది పూరి జగన్నాథ్ ఒక్కొక్క హీరో తో దాదాపు రెండు మూడు సినిమాలు చేయడం విశేషం. బద్రి సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా చేయగా ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను చేశాడు. మధ్యలో కొన్ని సినిమాలు చేయాల్సి ఉండగా అవి కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయి.

రవితేజతో అందరికంటే ఎక్కువగా ఐదు సినిమాలు చేశాడు పూరి జగన్నాథ్. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే మరియు దేవుడు చేసిన మనుషులు ఆయనతో చేసి 4 బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా ఆయన రెండు సినిమాలు చేశాడు. వాటిలో పోకిరి సినిమా ఇండస్ట్రీ ఆల్ టైం హిట్ రికార్డును సొంతం చేసుకోగా బిజినెస్ మెన్ చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ తో పూరి జగన్నాథ్ రెండు సినిమాల ను చేయగా ఒక సినిమా ఫ్లాప్ అయింది. ఇంకొక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆంధ్రావాలా ప్రేక్షకులను నిరాశ పరిచగా టెంపర్ ఇద్దరికీ అదిరిపోయే హిట్ సినిమాగా నిలిచింది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కూడా పూరి జగన్నాథ్ రెండు సినిమాలు చేశాడు. అయితే అవి రెండు డీసెంట్ హిట్ లను సంపాదించుకున్నాయి. ఒకటి బుజ్జి గాడు బాగా ఇంకొకటి ఏక్ నిరంజన్. ఇకపోతే అల్లు అర్జున్ తో కూడా పూరి జగన్నాథ్ దేశముదురు మరియు ఇద్దరమ్మాయిలతో అనే రెండు సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండూ కూడా మంచి హిట్ అయ్యాయి. ఇంకా కొంతమంది యువ హీరోలతో కూడా కొన్ని సినిమాలను చేసి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశ పరిచాడు. రామ్ తో ఇష్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు విజయ్ దేవరకొండ తో చేస్తున్న లైగర్ తో మరొక హిట్ సంపాదించాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: