కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ జ్యోతిక, సూర్య సౌత్ లో అతి పెద్ద స్టార్స్ మాత్రమే కాదు, అభిమానులు అత్యంత ఆరాధించే జంటలలో ఒకరు. కొంతకాలం ప్రేమించుకున్న తరువాత జ్యోతిక, సూర్య సెప్టెంబర్ 11, 2006 న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు దివా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరూ ఒకరి విజయాలను మరొకరు సెలబ్రేట్ అవకాశాన్నిఅస్సలు వదులుకోరు. అలాగే ఇద్దరూ ఒకరికొకరు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆదర్శనీయమైన జంటగా ముందుకు సాగుతున్నారు. అయితే వారి లవ్ స్టోరీ ఏంటి ? ఎలా లవ్ లో పడ్డారు ? అనే విషయం అస్సలు తెలీదు చాలా మందికి.

దక్షిణాదిలో జ్యోతిక, సూర్య అనేక హిట్ చిత్రాలను అందుకున్నారు. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఆమె. జ్యోతిక 'డోలీ సాజ్ కే రఖ్నా' అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టినప్పటికీ, ఆ తర్వాత ఆమె సౌత్ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపింది. సౌత్ లో జ్యోతిక మొదటి చిత్రం 'వాలి'. తరువాత 'దినకరన్'లో కనిపించింది. అతని మూడవ చిత్రం 'పూవెల్లం కెట్టుపర్', ఇందులో సూర్య సరసన నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సూర్య, జ్యోతిక మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరూ పరిశ్రమకు కొత్తగా వచ్చారు. చాలా కష్టపడ్డారు.

జ్యోతిక సౌత్ సినిమాల వైపు మొగ్గు చూపినప్పుడు ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. నిజానికి ఆ సమయంలో జ్యోతికకు తమిళం అస్సలు తెలియదు. తమిళం తెలియకపోయినా జ్యోతిక డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంది. పని, డైలాగ్ డెలివరీ పట్ల ఆమె అంకితభావం చూసిన తర్వాత సూర్య చాలా ఆశ్చర్యపోయాడు. జ్యోతిక స్వభావం, నటన పట్ల నిజాయితీని చూసి సూర్య ఫిదా అయిపోయాడు. జ్యోతిక చాలా తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.

కొద్ది రోజుల్లోనే ఇద్దరూ చాలా మంచి స్నేహితులయ్యారు. దీని తర్వాత సూర్య ప్రతి పార్టీకి జ్యోతికను ఆహ్వానించేవారు. సూర్య చిత్రం 'నంద' విడుదలైనప్పుడు జ్యోతిక కూడా దాని ప్రీమియర్‌కు వెళ్ళింది. 'కాఖా కాఖా' సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరి ప్రేమ కథ మొదలైంది. ఈ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీకి ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. అలా కొంతకాలం డేటింగ్ అనంతరం వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: