దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  సినిమాల్లో 'కెజిఎఫ్ 2' కూడా ఒకటి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. యశ్ హీరోగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్,రావు రమేష్, ప్రకాష్ రాజ్,రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.గత ఏడాది నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యమైంది.ఇక కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని సోలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కే జి ఎఫ్ 2 కు పోటీ వచ్చేంత ధైర్యం ఏ సినిమా చేయదు అని అనుకున్నారంతా.

 ఎందుకంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.కానీ కట్ చేస్తే కె.జి.ఎఫ్ 2 తో పోటీ పడేందుకు ఓ హీరో సిద్ధమయ్యాడు. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్. ఇతను నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. ముందుగా ఈ సినిమాని 2022 ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ త్వరలో ఆ సమయానికి పూర్తయ్యే వీలు కాకపోవడంతో ఏప్రిల్ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. దాంతో కే జి ఎఫ్ 2, లాల్ సింగ్ చద్దా సినిమాల మధ్య పోటీ తప్పదని అర్థమైపోయింది. అయితే తాజాగా ఈ విషయమై అమీర్ ఖాన్ కే జి ఎఫ్ 2 టీంకి క్షమాపణలు చెప్పాడు.

 ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.." నేనెప్పుడూ వేరే నిర్మాత ఫైనల్ చేసినా రిలీజ్ డేట్ ని తీసుకోను కానీ లాల్ సింగ్ చద్దా విషయంలో కరోనా కారణంగా మా ప్లాన్స్ అన్ని తారుమారు అయిపోయాయి. కరోనా సెకండ్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. షూటింగ్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తూ వచ్చాం. అయితే ఈ సినిమాలో నేను ఓ సిక్కు యువకుడి పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి పాత్ర నేను చేయడం ఇదే తొలిసారి. కాబట్టి సిక్కుల పండుగ రోజై బైసామ్ రోజునే సినిమాని విడుదల చేయాలని ఏప్రిల్ 14 న విడుదల చేయడానికి సిద్ధమయ్యాం. ఇక అదే రోజున విడుదల అవుతున్న కెజిఎఫ్ 2 నిర్మాతలకు ఈ సందర్భంగా నేను క్షమాపణ చెబుతున్నాను. నేను వేరే నిర్మాత ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ కి నా సినిమా ఎప్పుడు విడుదల చేయలేదు. కానీ ఈసారి అలా కుదిరింది. తప్పడం లేదు" అని కే జి ఎఫ్ 2 నిర్మాత అయిన విజయ్ కిరందుర్ కి సారి చెప్పాడు అమీర్ ఖాన్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: