వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం2  చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం2 సినిమాను అదే పేరుతో తెలుగు లో రీమేక్ చేసిన వెంకటేష్ మరొకసారి ఈ చిత్రాన్ని నమ్ముకొని మంచి పని చేశాడు. ఆయన కెరీర్లో వైవిధ్యభరితమైన చిత్రం గా ఈ సినిమా నిలిచి పోవడంతో పాటు మంచి విజయాన్ని కూడా ఆయనకు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా విషయం లో అందరికీ ఒకటే నిరాశ.

అదేమిటంటే ఈ చిత్రం థియేటర్ లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల అవడమే. ఏది ఏమైనా దృశ్యం సినిమా వెంకటేష్ కు మంచి పేరు తీసుకు వచ్చిందని చెప్పాలి. సీక్వెల్ చేసే విషయాల్లో ఎంతో మంది హీరోలు భయపడిపోయి తమ సినిమాలకు సీక్వెల్ చేయకుండా ఉంటారు కానీ వెంకటేశ్ అలా కాకుండా దృశ్యం సినిమా సీక్వెల్ చేశాడు. అలాగే ఇప్పుడు ఆయన హీరోగా చేసిన మరొక సూపర్ హిట్ చిత్రం f2 ki కూడా ఇప్పుడు ఆయన సీక్వెల్ చేస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ హీరోగా వరుణ్ తేజ్ మరో హీరోగా తెరకెక్కిన f2 చిత్రం విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా అలరించగా ఈ చిత్రం విజయం తర్వాత దీనికి సీక్వెల్ రాబోతుందని కొన్ని రోజులు వార్తలు ప్రచారం అయ్యాయి. వాటిని నిజం చేస్తూ దర్శకుడు ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమా నీ పూర్తి చేసే స్థాయికి తీసుకువచ్చాడు. ఫిబ్రవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. తమన్నా, మేహారీన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: