సినీ ఇండస్ట్రీ లో మూడున్నర దశాబ్దాలుగా కొన్ని వేల పాటలను రచించి తెలుగు ప్రేక్షక మదిలో చెరగని ముద్ర వేసుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు ... ఆయన చేసిన కృషి మరపురానిది. తన 37 సంవత్సరాల కెరీర్లో ఆయన ఎన్నో అవార్డులు ... రివార్డులు అందుకున్నారు.

ఆయన ఆరోగ్యం విషమించిందని తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఆయన... కొలుకుని వస్తారని ఆయన తిరిగి ఎన్నో హిట్ సినిమాలకు మంచి పాటలు అందిస్తారని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాసలు చేస్తూ త్రివిక్రమ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన పాటలను ప్రేమించే కోట్లాదిమంది అభిమానులు తీవ్ర విషాదం లో కూరుకుపోయారు.

ఇక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు , మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సిరివెన్నెలకు సమీప బంధువే. అయితే ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. త్రివిక్రమ్ ప్రతిభ, మంచితనం గురించి తెలుసుకున్న సిరివెన్నెల ఆయ‌న‌కు త‌న త‌మ్ముడు కూతురిని ఇచ్చి పెళ్లి చేయాల‌ని అనుకున్నారు. ఇంట్లో పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి చూపుల్లో అనుకోని ట్విస్ట్ జ‌రిగింది.

పెళ్లి చూపులకు వెళ్లిన త్రివిక్రమ్.. ఆమెను కాకుండా పెళ్లి కూతురు చెల్లెలిని ఇష్టపడ్డాడు. ఈ విషయాన్ని సిరివెన్నెలకు చెప్పార‌ట‌. అయితే త్రివిక్ర‌మ్ ను ఎలాగైనా అల్లుడిని చేసుకోవాని సిరివెన్నెల ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇంట్లో వాళ్ల‌ను ఒప్పించారు. అక్క పెళ్లి అయ్యాకే ఆమె చెల్లినే త్రివిక్ర‌మ్ పెళ్లాడారు. అలా సిరివెన్నెల సోదురుడి కుమార్తె సౌజన్యను వివాహం చేసుకుని సిరివెన్నెల‌కు అల్లుడు అయ్యారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత‌గా బ‌ల‌ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: