ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్ర బడ్జెట్ పెరిగిపోవడంతో ఒక్కసారిగా ఈ చిత్ర నిర్మాతలపై ఎంత ఒత్తిడి పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల ఆలస్యం అవ్వడంతో పాటు బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోవడంతో వారి కి సమస్య ఒత్తిడి ఇప్పటికీ నెలకొంది అని చెప్పవచ్చు. రాధాకృష్ణ దర్శకత్వంలో మూడు సంవత్సరాల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు అంటే దానికి వడ్డీ భారం ఎంతలా పెరిగిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

చిన్న సినిమాలపైనే భారీగా వడ్డీ భారం ఉన్న నేపథ్యంలో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై ఎంతటి వడ్డీ భారం  ఉందో అర్థం చేసుకోవచ్చు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కాకపోవడం కూడా సరిగ్గా షూటింగ్ జరగక పోవడంతో ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జనవరి 18వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అంతా సిద్ధం చేయగా కరోనా మరొకసారి ఈ చిత్రానికి భారీగా దెబ్బ వేసింది.

వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ లో 80 శాతం రెమ్యునరషన్ రూపంలో వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు. వాటిలో ప్రభాస్ 150 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. అలాగే మిగతా నటీనటులు 25 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. దర్శకుడు కూడా 20 కోట్లు తీసుకున్నాడానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చిత్రీకరణకు 100 కోట్ల బడ్జెట్ కావడంతో ఈ సినిమా కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు జరిగింది. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు వ్యయం జారడం అంటే ఈ సినిమా విడుదల విడుదల అయ్యి భారీ హిట్ కావాలి. ఈ నేపథ్యంలో ఇది సాధించాలంటే థియేటర్ లు అన్ని ఓపెన్ అయి ఉండాలి. అలా జరగడం ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగదు కాబట్టి ఈ సినిమాను వాయిదా వేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: