అందాల ముద్దుగుమ్మ తమన్నా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో మంచి పేరును తీసుకువచ్చింది, అయితే హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. తమన్నా కేవలం  తెలుగు భాష సినిమాలలో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది, ఇది ఇలా ఉంటే తమన్నా ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ తో కూడా తమన్నా అలరించబోతోంది. 

 ఇలా సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా తమన్నా ప్రేక్షకులను అలరించింది, ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న తమన్నా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా తనకు సంబంధించిన  ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా తమన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలలో మిల్కీబ్యూటీ తమన్నా రెండు రకాల చీరలను కట్టుకొని, అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఈ చీర కట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: