మహానటి.. సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్ నటించిన తర్వాత ఈమె పేరును కూడా మహానటిగా పిలవడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇటు తెలుగు ప్రేక్షకులను ఇటు కోలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో ఎంతో బాగా ఆకట్టకుంటూ..వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంటోంది.. ఆ పాత్ర ద్వారా తనకు గుర్తింపు లభిస్తుంది అంటే చెల్లి పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే.. రజినీకాంత్ సినిమాలో కూడా ఆమె నటించి నిరూపించుకుంది.. చెల్లెలి పాత్రలో కూడా ఈమె వరుస అవకాశాలు అందుకుంటూ మరోవైపు హీరోయిన్ గా కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.


గుడ్ లక్ సఖి సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ అదృష్టాన్ని వెతుక్కునే అమ్మాయి పాత్రలో కీర్తి సురేష్ మనకు దర్శనం ఇవ్వబోతోంది. జనవరి 28వ తేదీన ఈ సినిమాను చాలా గ్రాండ్గా విడుదల చేయబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిన్న రాత్రి హైదరాబాదులో చాలా ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవడంతో పాటు ఆయన వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరవడం జరిగింది.. ఇక ఈ స్టేజ్ మీద కీర్తి సురేష్ కోరిక మేరకు రామ్ చరణ్ ఆమె తో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నాటు నాటు పాటకి కలిసి డాన్స్ వేశారు.


అంతేకాదు రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ మా మహానటి ఎందులోనైనా నటించగలరు.. ఎలా అయినా నటించగలరు ఆమె గొప్ప మా మహానటి అని సంబోధించడం తో అక్కడ ప్రేక్షకులంతా ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేశారు.. అంతేకాదు వీరిద్దరు కలిసి డాన్స్ చేయడంతో అక్కడి వాతావరణం కూడా చాలా సందడిగా మారిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: