సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్ లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు,  కానీ కొంతమంది హీరోయిన్ లు మాత్రం తమ అందంతో, అభినయంతో,  నటనతో  చాలా కాలం పాటు ఇండస్ట్రీలో మంచి స్థానంలో కొనసాగుతూ ఉంటారు.  ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో, అభినయంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకొని ప్రస్తుతం కూడా వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ లో మిల్కీ బ్యూటీ తమన్న ఒకరు.  హ్యాపీ డేస్ సినిమాతో తమన్నా తెలుగునాట మంచి క్రేజ్ ని సంపాదించుకుంది,  ఆ తర్వాత తెలుగునాట అనేక మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి తెలుగు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా చాలా కాలం పాటు తమన్నా కొనసాగింది.

 ఇదిలా ఉంటే ఆ తర్వాత తమన్నా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినా చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలతో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది,  కేవలం తమన్నా టాలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇతర భాష ఇండస్ట్రీలో కూడా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది,  అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది.  ఇలా కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఇప్పటికే తమన్నా నవంబర్ స్టోరీస్, ఈవెంత్ హావర్ అనే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది, ఈ రెండు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను పొందాయి.  వెబ్ సిరీస్ లో మాత్రమే కాకుండా తమన్నా మాస్టర్ చెఫ్ అనే టీవీ షో కూడా హోస్ట్ గా వ్యవహరించింది, అలాగే తమన్నా ఇప్పటికే అల్లుడు శీను, జై లవకుశ,  కేజిఎఫ్ సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది, ప్రస్తుతం కూడా తమన్నా, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది,  తమన్నా ఇలా సినిమాలు, వెబ్ సిరీస్,  టీవీ షోలు ఏవి వదలకుండా  కుర్ర హీరోయిన్ లకు పోటీగా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: