ఇక ప్రస్తుతం అలాంటి వారిలోకి మన యంగ్ హీరో రానా కూడా చేరబోతున్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు సంస్థల అధినేత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానా ఆ తర్వాత మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రానా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు అని చెప్పవచ్చు. పోతే రానాకు కంటి సమస్యలు ఉన్న ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గర్లోనే ఉండాలనే దేశ విదేశాలలో సైతం తిరిగి కంటి ఆపరేషన్లు చేయించుకుంటూ.. నటనపై ఉన్న ఆసక్తిని తగ్గించుకోవడం లేదు.
రానకి ఆయన ఒక పెద్ద బిజినెస్ మేన్ అవ్వాలని కోరిక ఉన్నదట.. సినిమాలు మానేసిన తరువాత తను వాటి వైపు ఎక్కువగా ఫోకస్ పెడతానని ఒక ప్రముఖ షో కి పాల్గొన్నప్పుడు తెలియజేశాడు రానా. అయితే దాదాపుగా రానా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇక రానా తన కెరియర్ లోనే ఎన్నో మంచి మంచి పాత్రలు చేస్తూ మంచి నటుడిగా పేరు పొందాడు. కాని ఎక్కువ స్థాయిలో తనని మెప్పించే పాత్రలు చేయలేకపోయానని తెలియజేశాడు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి