ఇక టాలీవుడ్ లో ఇలాంటి ఫిలాసఫీని పాటించే హీరో రవితేజ, నాని ఉన్నారు అని చెప్పవచ్చు. అయితే మిగతా హీరోలు కూడా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్లుగా సమాచారం.. యువ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణి గారు, ఎస్.ఆర్ కళ్యాణమంటపం, వంటి సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న చిత్రం సెబాస్టియన్ pc 524 .
ఈ సినిమాని రాజా ప్రమోద్ నిర్మించారు.. దర్శకుడు బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక కిరణ్ సరసన నువేక్ష కథానాయికగా నటిస్తోంది. ఇక ఇందులో ముఖ్యమైన పాత్రలో రోహిణి కూడా కనిపించనుంది. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ఆహా లో విడుదలకు సిద్ధంగా ఉన్నది. అలాగే సెబాస్టియన్ సినిమా కూడా తాజాగా వాయిదాపడుతూ మార్చి 4 వ తేదీకి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది.. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశామని తెలియజేశారు చిత్రబృందం. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఒక విభిన్నమైన కథతో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి