సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను బాగా అలరించిన నటులలో కమలహాసన్ తర్వాత అంతటి నటనను ప్రదర్శించే నటులలో హీరో చియాన్ విక్రమ్ ఒకరిని చెప్పవచ్చు. ఈయన నటించిన అపరిచితుడు, ఐ, పితామగన్ వంటి చిత్రాలలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అని చెప్పవచ్చు. తను నటించే ప్రతి ఒక్క సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తూ ఉంటాడు విక్రమ్. అయితే ఎన్నో ఏళ్ల కిందట హీరో విక్రమ్ నటించిన కోబ్రా చిత్రం విడుదల కాకుండా అలానే ఉన్నది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ విడుదలైంది వాటి గురించి చూద్దాం.


హీరో విక్రమ్ 7 గెటప్ లతో అదరగొట్టే పాత్రలో కోబ్రా సినిమాలో నటించాడు. ఈ సినిమా నుంచి ఇదివరకే ఫస్ట్ లుక్ వీడియోలు కూడా వైరల్గా మారాయి. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తే హీరో విక్రమ్ తను నాతో విశ్వరూపాన్ని మళ్ళీ చూపించాడని చెప్పవచ్చు. ఏడు అవతారాలలో ఒకదానికి కూడా అ మరొకటి పోలిక లేకపోవడం గమనార్హం. ఇక ఈ ఏడు జటప్రోలు చూస్తే ఈ కథలు చాలా సీరియస్ స్టోరీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. విక్రమ్ కెరియర్ లో ఈ సినిమా ఒక వినూత్న చిత్రంగానే కాకుండా.. ఒక ప్రయోగాత్మక చిత్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.


ఈ సినిమాలో హీరో విక్రమ్ ఇది వరకు ఏ సినిమాలో చూడని విధంగా కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమాతో ఈసారైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటివరకు ఎవరు కనిపించని అవతారాలలో హీరో విక్రం అలరించబోతున్నాడు కోబ్రా మూవీతో అంటూ చిత్ర బృందం తెలపడం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ తెగ వైరల్ గా మారుతోంది. ఈ సినిమా వచ్చే నెల 26వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు గా సమాచారం. అందుకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: