మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉండడం ఇప్పుడు ఎంతో టెన్షన్ ను కలిగిస్తుంది. బన్నీ సినిమా పాటలను కాపీ చేస్తున్నారంటూ ఓ రేంజ్ లో మహేష్ బాబు పై వారు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో ఎంతో వైరల్ గా మారింది అని చెప్పవచ్చు. వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అలా వైకుంఠపురం లో సినిమా. ఆ సినిమా నుంచి భారీ స్థాయిలో క్రేజ్ ను పెంచుకున్నాడు తమన్.

ఇండస్ట్రీ వర్గాలను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆయన సంగీతాన్ని అందించడం మొదలుపెట్టాడు. అల వైకుంఠపురం లో సినిమా హిట్ లో తన పాత్ర చాలా ఉంది. తన అద్భుతమైన సంగీతం తోనే ఈ సినిమా ఇంత పెద్ద విజయానికి నాంది పలకడం జరిగింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా భారీ బ్లాక్బస్టర్ అవ్వడం తో తనకు తిరుగు లేకుండా పోయింది. ఆ విధంగా ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆయన చేస్తున్న చిత్రానికి సంబంధించిన పాటలను విడుదల చేయగా తాజాగా విడుదల చేసిన పెన్నీ పాట అల వైకుంఠపురం లో ని పాటలను తలపిస్తున్నాయి.

దాంతో అల్లు అర్జున్ అభిమానులు తమన్ పై మండి పడుతూన్నారు. సంగీత దర్శకుడు తమన్ పై మాత్రమే కాదు సినిమా బృందం పై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన రెండు పాటలు అల వైకుంఠపురం లో సినిమా కు సంబంధించిన మ్యూజిక్ లా ఉండడంతో ఇప్పుడు హీరోల ఫ్యాన్స్ మధ్య ఈ వివాదానికి కారణం అవుతుంది. దీనిని బట్టి తమన్ ఒరిజినల్ మ్యూజిక్ ని చేస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఇలా వ్యవహరిస్తూ ఉంటే మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమన్ వర్క్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమ అభిమాన హీరో క్రేజీ మూవీ కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించినందుకు ఓ రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు.  పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ జీ ఎం బీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: